నాయ‌కుల అరెస్టు దుర్మార్గం

క్రైం తాండూరు వికారాబాద్

నాయ‌కుల అరెస్టు దుర్మార్గం
– వ్యకాస జిల్లా అధ్య‌క్షులు బుగ్గ‌ప్ప‌
యాలాల‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: భూస‌మ‌స్య‌లు, ఇండ్ల స్థ‌లాల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని పోరాటం చేసే నాయ‌కుల‌ను అరెస్టు చేయ‌డం దుర్మార్గ‌మ‌ని వ్య‌వ‌సాయ కార్మిక సంఘం(వ్య‌కాస‌) జిల్లా అధ్య‌క్షులు యు.బుగ్గ‌ప్ప అన్నారు. భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం వ్య‌వ‌సాయ కార్మిక సంఘం, సీఐటీయూ, కేవీపీఎస్, రైతు సంఘాల ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ ముట్ట‌డి సంద‌ర్భంగా పోలీసులు ఆయా సంఘాల నాయ‌కుల‌ను అరెస్టు చేసి పోలీస్టేష‌న్‌కు త‌రించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా అధ్య‌క్షులు బుగ్గ‌ప్ప మాట్లాడుతూ ప్ర‌భుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని నాయకులను, రైతులను ఎక్కడిక్కడ అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. నాయ‌కుల‌ను అరెస్టుల‌ను తీవ్రంగా ఖండించారు. భారతరాజ్యాంగలో పొందుపరాచిన ఆర్టికల్ 19 ప్రకారం ప్రతిఒక్కరికి స్వేచ్ఛాయుత గా నిరసన తెలిపే హక్కు భారత రాజ్యాంగం కల్పించడం జరిగిందని అలాంటి హక్కులను టిఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ప్రయత్నిస్తుందని విమ‌ర్శించారు. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో భూ సమస్యలతో వందలాది మంది రైతులు ప్రతిరోజు కలెక్టర్ మరియు ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే పట్టించుకునే నాధుడే కరువయ్యారు అని అన్నారు. ప్రజా సమస్యలపై పరిష్కారం చూపాలని పేదల కోసం పని చేస్తున్నామని గొప్పలు చెప్పే ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వారి సమస్యలపై నిర్లక్ష్యంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, మరియు ప్రభుత్వ అధికారులు స్పందించి గ్రామ స్థాయిలో రైతులు ఏటా ఎదుర్కొంటున్న టువంటి భూ సమస్యలు, అసైన్డ్ భూములలో కాస్తులో ఉన్న రైతులందరికీ పట్టాలు ఇవ్వాల‌ని, ఫారెస్ట్ భూములు కబ్జా లో ఉన్న గిరిజన గిరిజనేతర రైతులందరికీ హక్కు పత్రాలు వెంటనే ఇవ్వాలని, ఇల్లు లేని దళితులకు ఇంటి స్థలాలు ఇప్పించాల‌ని, ఇంటి స్థ‌లం ఉన్న వారికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా మూడు లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లేనిచో గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో యాదప్ప, శ్రీనివాస్, నర్సింలు, రమేష్ ఉన్నారు.