ధన్యోస్మీ దుర్గామాత..!
– నగరేశ్వర దేవాలయంలో ఉత్సవాలు
– బతుకమ్మ ఆడిన మహిళలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ధన్యోస్మీ… దుర్గామాత అంటూ తాండూరు ఆర్యవైశ్య మహిళలు, భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో వాసవీ మహిళ సంఘం, ఆర్యవైశ్య అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. గురువారం ఎనిమిదవ రోజు వాసవీ మాతను దుర్గామాతగా అలంకరించారు. వాసవీ సంఘం మహిళలు, భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. అదేవిధంగా దేవాలయంలో బతుకమ్మ సంబరాలను అట్టహాసంగా జరుపుకున్నారు.
ఆధ్యాత్మిక, సంప్రదాయ పద్దతులతో దేవాలయం ప్రాంగణం సందడిగా మారింది. ఈ ఉత్సవాల్లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ లు కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, సునీతాసంపత్, నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్, ఉపాధ్యక్షురాలు గుబ్బ ప్రగతి, ప్రధాన కార్యదర్శి మంకాల స్వప్న రాఘవేందర్, ఉప కార్యదర్శి తాళ్లపల్లి కవిత, కోశాధికారి సింగంశెట్టి శోభ, వాసవీ మహిళ సంఘం సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

