రేప‌టి స‌మావేశానికి భారీగా త‌ర‌లిరండి

తాండూరు రాజకీయం వికారాబాద్

రేప‌టి స‌మావేశానికి భారీగా త‌ర‌లిరండి
– టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం)
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: కేంద్ర వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరులో నిర్వహిస్తున్న నియోజకవర్గ విస్తృతస్థాయి సన్నాహాక సమావేశానికి పార్టీ శ్రేణులు, కార్య‌క‌ర్త‌లు, రైతులు భారీగా త‌ర‌లిరావాల‌ని పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రేపు గురువారం తాండూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 11 గంటలకు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించే సమావేశానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు హాజరవుతున్నారని చెప్పారు. కావున ఈ సమావేశానికి తాండూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్త‌ను స‌మ‌ర్పించిన వారు