రవాణా చార్జీలు పెంచాల్సిందే
– దర్నా చేపట్టిన తాండూరు లారీ ఓనర్స్ అసోసియేషన్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: రవాణా చార్జీలు పెంచితీరాలని తాండూరు లారీ ఓనర్స్ అసియేషన్ సభ్యులు దర్నాకు దిగారు. బుధవారం పట్టణ సమీపంలోని శెష్ ప్రభ థియేటర్ వద్ద టెంట్ వేసుకుని ఆందోళనకు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏన్నో ఏళ్లుగా లారీలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని తెలిపారు. గత కొన్నేళ్ల నుంచి డిజీల్ ధరలు పెరిగినా నష్టం భరిస్తూ లారీలను నడిపామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డీజీల్ ధరలు ఆకాశాన్నంటడంతో భారం మోసే పరిస్థితులు లేవన్నారు. దీనిని గుర్తించుకుని పెరిగిన డీజీల్ ధరలకు అనుగుణంగా రవాణా చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. హామాలి, గుమాస్త మామూళ్లతో పాటు తైబజార్ ఆశీలు వారె చెల్లించుకోవాలన్నారు. రవాణా చార్జీలు పెంచే వరకు లారీలు నడిపేదిలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు శేఖర్, సతీష్, అయూబ్, కిరణ్, అబ్దుల్, గులాం, దేవేందర్, జాకీర్, వేణుగోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
