క్రీడాకారుల నైపుణ్యానికి ప్రోత్సహాం

కెరీర్ క్రీడలు తాండూరు వికారాబాద్

క్రీడాకారుల నైపుణ్యానికి ప్రోత్సహాం
– బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.సంపత్ కుమార్
– చెన్‌గెష్‌పూర్‌లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: గ్రామీణ ప్రాంత క్రీడాకారుల నైపుణ్యానికి ప్రోత్సహాం అందిస్తామని తాండూరు బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు. బుధవారం తాండూరు మండలం చెన్‌గెష్‌పూర్‌లో బీవీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ సంపత్ కుమార్ హాజరై గ్రామ సర్పంచ్ రాములమ్మలతో కలిసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలోని పేద క్రీడాకారులకు, ప్రతిభ కనబరిచే యువతకు ఆర్థిక తోడ్పాటు అందిస్తామన్నారు. క్రీడల్లో నైపుణ్యతను పెంపొందించుకునేందుకు ప్రోత్సహా పరుస్తామన్నారు.
టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పార్వతమ్మ, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్ చారి. భీంసేన్ రావు, టీఆర్ఎస్ పార్టీ తాండూరు ప‌ట్ట‌ణ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.శ్రీనివాస్, మహేష్ ఠాకూర్, టొర్న‌మెంట్ నిర్వహకులు సమీర్, అనిల్, అశోక్, బాలు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్త‌ను స‌మ‌ర్పించిన వారు