రేపు, ఎల్లుండి మాంసం విక్రయాలు బంద్
– వ్యాపారులకు మున్సిపల్ నోటీసులు జారీ
– అతిక్రమిస్తే చట్టరిత్య చర్యలంటూ హెచ్చరిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మాంసం విక్రయాలపై మున్సిపల్ అధికారులు ఆంక్షలు విధించారు. రేపు, ఎల్లుండి మటన్, చికెన్, చేపల విక్రయాలు చేపట్టరాదని నోటీసులు అందించారు.

తాండూరు పట్టణంలోని మాంసం వ్యాపారులతో పాటు వధశాలల నిర్వహకులకు, హోటల్, రెస్టారెంట్ నిర్వహకులకు నోటీసులను అందజేశారు. ఆగస్టు 15వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాంసం విక్రయాలు చేపట్టరాదని నోటీసులు పేర్కొన్నారు. అదేవిధంగా ఆగస్టు 16న శ్రీకృష్ణాష్టమి పండగ సందర్బంగా విక్రయాలపై నిషేధం విధించడం జరిగిందని స్పష్టం చేశారు.

రెండు రోజులు ఎలాంటి విక్రయాలు చేపట్టరాదని సూచించారు. నోటీసులు అందుకున్న వ్యాపారులు మున్సిపల్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టరిత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతి యేడాది స్వాతంత్ర దినోత్సవ, పండగ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సారి కూడా మాంసం విక్రయాలు జరగకుండా నోటీసులు జారీ చేశారు. ఇందుకు వ్యాపారులు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…


