జై శ్రీరాం.. జై హనుమాన్..!
– భక్తిశ్రద్దలతో హనుమాన్ అర్దమండల దీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి: జై శ్రీరాం, జై హనుమాన్ నినాదాలతో తాండూరు పట్టణంలోని కన్యా పాఠశాల హనుమాన్ దేవాలయం మార్మోగింది. శనివారం హనుమాన్ దేవాలయంలో హనుమాన్ దీక్ష సమితి ఆధ్వర్యంలో భక్తులు అర్దమండల దీక్ష చేపట్టారు. ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ జోషి, హనుమంతు గురు స్వామి ఆధ్వర్యంలో 20 మందికి పైగా హనుమాన్ అర్ధం మండల దీక్ష తీసుకున్నారు.
దీక్ష తీసుకున్న భక్తులు జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ జయ జయ ద్వానాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా అర్చకులు, గురుస్వామి, హనుమాన్ దీక్ష సమితి కార్యదర్శి మీదిపేట వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ దీక్ష తీసుకున్న స్వాములు ప్రతి ఒక్కరిని జై శ్రీరామ్ అనే నామము తలవాలని సూచించారు. దీని ద్వారా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి అని పేర్కొన్నారు. అనంతరం స్వాములు తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష సమితి సభ్యులు, గురు స్వాములు, సమితి లీగల్ అడ్వాయిజర్ గుండప్ప అడ్వకెట్ గారు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

