సీతారామ చంద్ర‌మూర్తికి జై..!

తాండూరు వికారాబాద్

సీతారామ చంద్ర‌మూర్తికి జై..!
– చెంగోల్‌లో తొలిసారి జ‌గ‌ద‌భిరాముని క‌ళ్యాణం
– గ్రామంలో వెల్లిరిసిన ఆద్యాత్మిక‌త
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: శ్రీ సీతారామ‌చంద్ర‌మూర్తికి జై.., జై శ్రీ‌రాం. జైజై శ్రీ‌రామ్.. అంటూ తాండూరు మండ‌లం చెంగోల్ గ్రామం మార్మోగింది. గ్రామంలో తొలిసారి ఆదివారం శ్రీ‌రామ న‌వ‌మిని వైభ‌వంగా జ‌రుపుకున్నారు. శ్రీ‌రామ న‌వ‌మి సంద‌ర్భంగా జ‌గ‌ద‌భిరాముని క‌ళ్యాణోత్స‌వాన్ని అత్యంత వైభ‌వోపేతంగా నిర్వ‌హించారు. శ్రీ సీతారాముల త‌రుపున గ్రామ పెద్ద‌లు పాల్గొని క‌ళ్యాణోత్స‌వాన్ని జ‌రిపించారు. వేద పండితుల మంత్రోత‌చ్చ‌ర‌ణ‌ల మ‌ద్య నీల‌మేఘ‌శ్యాముడు శ్రీ‌రామ‌చంద్రమూర్తి సీతాదేవికి మాంగ‌ళ్య దార‌ణ చేశారు. ఈ స‌మ‌యంలో గ్రామ‌స్తులు, భ‌క్తులు శ్రీ‌సీతారాము నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగించారు. దీంతో గ్రామంలో ఆద్యాత్మిక వాతావ‌ర‌ణం నెల‌కొంది.
శ్రీరామ న‌వ‌మి, సీతారాముల క‌ళ్యాణోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల వెంక‌టేశం, గ్రామ స‌ర్పంచ్ మ‌ళ్లీశ్వ‌రి శేఖ‌ర్ గౌడ్, ఎంపీటీసీ ర‌త్నామాల రాము యాద‌వ్, ఉప స‌ర్పంచ్ ల‌క్ష్మ‌ణ్, వివేకానంద యువ‌జ‌న సంఘం స‌భ్యులు హ‌న్మ‌య్య‌, నారాయ‌ణ రెడ్డి, మాజీ స‌ర్పంచులు గోపాల్ రెడ్డి, పులేంద‌ర్, గ్రామ పెద్ద‌లు, భ‌క్తులు, యువ‌కులు భారీ సంఖ్య‌లో పాల్గొని సీతారాముల‌ను ద‌ర్శించుకున్నారు. గ్రామాన్ని స‌ల్లంగా చూడాల‌ని, ప‌శు, పాడి, వ్య‌వ‌సాయం అభివృద్ధి చెందేలా దీవీంచాల‌ని సీతారాముల‌ను వేడుకున్నారు.