హెచ్‌సీయూలో తాండూరు విద్యార్థికి సీటు

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

హెచ్‌సీయూలో తాండూరు విద్యార్థికి సీటు
– సన్మానించిన తాండూరు వీర‌శైవ యువ‌జ‌న స‌మాజం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో తాండూరు విద్యార్థినికి సీటు ల‌భించింది. తాండూరు పట్టణానికి చెందిన వీరశైవ విద్యార్థి శృతి హెచ్‌సీయూలో సీటు సాధించింది. దీంతో మంగళవారం రాత్రి ప‌ట్ట‌ణంలోని భాగివి భద్రేశ్వర దేవాలయంలో

వీరశైవ యువత ఆధ్వర్యంలో విద్యార్థిని శృతిని సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి శృతి సీటు సాధించ‌డం వీరశైవ లందరికీ గర్వకారణమని అన్నారు. శృతిని తోటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శృతి తల్లిదండ్రులు శరణు, వీర సేవ యువత అధ్యక్షులు అభిషేక్, సంఘం సభ్యులు శెట్టి భాస్కర్, కందనెల్లి సంగమేశ్వర్, రవికుమార్, శివానంద్ సోమ‌నాథ్‌ తదితరులు ఉన్నారు.