పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలి
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
– విద్యార్థులకు పరీక్షల ప్యాడ్‌ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని నెంబర్-2 స్కూల్, ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక పరీక్షా ప్యాడ్లను, పెన్నులు, పెన్సిళ్లు, పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు గారు మాట్లాడుతూ..ప్రతి విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా కష్టపడి చదవాలన్నారు. ప్రతిఒక్కరు విద్యలో రాణించడమే కాకుండా ఉన్నత శిఖరాలు అధిరోహించలని అన్నారు. పరీక్షల్లో100 శాతం ఉత్తీర్ణతతో 10 జీపీఏ సాధించాలని అన్నారు. పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నయూం(అఫ్పూ), కౌన్సిలర్లు ముక్తర్ నాజ్, బాంబీనా, స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవ్ రావు, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎం. శ్రీనివాస్, సంతోష్ గౌడ్, నాయకులు గుండప్ప, ఆన్వార్ ఖాన్, మహేశ్వర రెడ్డి, మొయిజ్, సమద్ తదితరులు పాల్గొన్నారు.


