సామాన్యుల‌కు మ‌రోషాక్..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ

సామాన్యుల‌కు మ‌రోషాక్..!
– పెరిగిన స‌బ్బులు, డిజ‌ర్జెంట్‌ల ధ‌ర‌లు
– ప్ర‌క‌టించిన ఎఫ్ఎంసీజీ కంపెని
– ఏయే ధ‌ర‌లు ఎంత పెరిగాయంటే
ద‌ర్శిని డెస్క్: పెట్రోల్, డీజీల్, మంచి నూనెల ధ‌ర‌ల‌తో విల‌విల్లాడుతున్న సామాన్యుల‌పై మ‌రో పిడుగు ప‌డింది. పెరుగుతున్న ముడి పదార్థాల రేట్ల వల్ల కంపెనీలు తమ ఉత్పత్తుల రేట్లను పెంచుతున్నాయి. తాజాగా.. హిందుస్థాన్ యూనిలీవర్(Hindustan Unilever) సంస్థ ఏప్రిల్ లో తన ఉత్పత్తుల ధరలను మరోసారి పెంచింది. FMCG మేజర్ స్కిన్ క్లెన్సింగ్, డిటర్జెంట్ల రేట్లను 3-20 శాతం ధరలను పెంచింది. దీనివల్ల డవ్, పియర్స్ వంటి సోప్ బార్ల రేట్లు భారీగా 20 శాతం వరకు పెరిగాయి. వీటికి తోడు ఎక్కువ మంది వాడే లైబ్బాయ్ సబ్బు రేట్లలో కూడా పెరుగుదల కనిపించింది. ఇతర ఉత్పత్తులైన వీల్ డిటర్జెంట్ ప్యాక్ రేట్లు కూడా పెరిగాయి. గత నెలలో లక్స్, లైబ్బాయ్, డప్ షాంపూ, కిస్సాన్ జామ్, హార్లిక్స్, పెప్సోడెంట్, సర్ఫ్ ఎక్సెల్, విమ్ బార్ తో సహా మరికొన్ని ఉత్పత్తుల ధరలను పెంచింది. నెట్ రెవెన్యూ మ్యానేజ్ మెంట్ ప్రాతిపదికన తాము ధరలను నిరంతరం పెంచుతూనే ఉంటామని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఫైనాన్స్, IT రితేష్ తివారీ తెలిపారు.

పెరిగిన ధ‌ర‌లు ఈ విధంగా ఉన్నాయి
– 4 లైఫ్ బాయ్ సోపు ప్యాకెట్ల ధర రూ.124 నుంచి రూ.136 కు పెరిగింది

– 500 గ్రాముల వీల్ డిటర్జెంట్.. రూ.32 నుంచి రూ.33కు పెరిగింది

– కేజీ వీల్ డిటర్జెంట్.. రూ.63 నుంచి రూ.65ల‌కు పెరిగింది.

– 25 గ్రాముల డవ్ సోపు.. రూ.12కు పెంచింది.

– 25 గ్రాముల పియర్ సోపు, రూ.12కు పెరిగింది.

– విమ్ లిక్విడ్ ధర రూ. 99 నుంచి రూ. 104కు పెరిగింది.