రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
– జిల్లా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
-రోగులను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: అతిపారతో ఆసుపత్రి చేరిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. గురువారం తాండూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అతిసార కేసుల నమోదు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ప్రతి వార్డుకు వెళ్లి పరామర్శించారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలకు ధైర్యం చెప్పారు. అతిసారకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు.
అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూరులో అతిసార కేసుల నమోదుపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రిలో చేరిన రోగులకు మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్, వైద్యులను ఆదేశించినట్లు చెప్పారు. అవసరమైతే హైదరాబాద్ కు తరలించి నాణ్యమైన సేవలందించేలా చూస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ (నయూం), సీనీయర్ నాయకులు డాక్టర్ సంపత్కుమార్, రాజుగౌడ్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాసాచారి, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, ఉర్దూ మర్ చైర్మన్ అబ్దుల్ రజాక్, యువనాయకులు సంజీవరావు, మోయిజ్ తదితరులు ఉన్నారు.

