ఇఫ్తార్ మతసామరస్యతకు ప్రతీక
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: రంజాన్ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందు హిందూ ముస్లింల మధ్య మత సామరస్యతను, సోదరభావాన్ని పెంపొందడానికి ప్రతీకగా నిలుస్తాయని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముస్లింలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులకు పళ్లు తినిపించి రోజాను విరమింపచేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం లు కఠినమైన ఉపవాస దీక్ష చేపడతారని, ఉపవాస దీక్ష ముగిసే సమయంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చారి, రాజుగౌడ్, న్యాయవాది గోపాల్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన సంతోష్ గౌడ్, యువనాయకులు బాసిత్ అలీ, మోయిజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

