ధరణి సమస్యలపై పరిష్కారానికి చర్యలు
– తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్
– బషీరాబాద్ ప్రజావాణిలో 59 దరఖాస్తులు
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి: ధరణిలో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం బషీరాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. మండల స్థాయిలో నిర్వహించిన ప్రజావాణికి ఆర్డీఓ అశోక్ కుమార్ హాజరై రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ ధరణి సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. రైతులకు ఏమైనా భూ సమస్యలు ఉంటే మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను దశలవారిగా పరిష్కరిస్తామన్నారు. మరోవైపు ఎమ్మార్వో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 59 దరఖాస్తులు అందాయని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట స్వామి, డిప్యూటీ తహసీల్దార్ వీరేశం, సిబ్బంది పాల్గొన్నారు.

