భద్రేశ్వర్కి జై.!
– పల్లకిలో ఊరేగిన భద్రేశ్వరుడు
తాండూరు, దర్శిని ప్రతినిధి: భద్రేశ్వర్కీ జై.. భద్రేశ్వర్కీ జై.. అంటూ తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం దద్దరిల్లింది. జాతర ఉత్సవాల్లో భాగంగా పల్లకి సేవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి భద్రేశ్వరున్ని పల్లకిలో ఊరేగించేందుకు స్వామి వారి విగ్రహ ప్రతిమను ఆలయం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో భక్తులు తమన్వయంతో భద్రేశ్వర్కీ జై, భద్రేశ్వర్కీ జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్వామి వారిని పల్లకిలో ఊరేగింపుకు తరలించారు. పల్లకి సేవ ముందు కళాకారుల నృత్య విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. స్వామి వారిని కీర్తిస్తూ భక్తులు ఆలాపించిన భజన కీర్తనలు మనోరంజకంగా జరిగాయి. పల్లకి సేవ ఊరేగింపులో భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


