తాండూరు మున్సిపల్ అభివృద్ధికి సహకరించండి
– జిల్లా కలెక్టర్‌ను కలిసిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ అభివృద్ధికి సహాకారం అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖలను మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కోరారు. శనివారం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ నిఖలను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాండూరు మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ను కోరినట్లు చైర్ పర్సన్ స్వప్న తెలిపారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సహాకారం అందిస్తామని తెలిపారని పేర్కొన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బొబ్బిలి శోభారాణి, సీనీయర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు బిర్కడ్ ఉశ తదితరులు ఉన్నారు.


