తోపాతో ఖుషీ చేసిన ముస్లిం వెల్పేర్ ట్రస్ట్
– ముస్లింకు రంజాన్ కిట్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: పవిత్ర రంజాన్ పండగకు పేద ముస్లింను ఖుషీ చేసింది తాండూరు ముస్లిం వెల్పేర్ ట్రస్ట్. తోఫాలను అందించి సంతోష పెట్టింది. ఆదివారం తాండూరు ముస్లిం వెల్పేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ మహమ్మద్ జియావుద్దీన్, బాసిత్ అలీలు పట్టణంలోని ముంకుంద్ ఆసుపత్రి వద్ద పేద ముస్లింకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. 10 కిలో బియ్యం, నూనే, చక్కెర, పండగ నిత్యవసరులను డాక్టర్ మహమ్మద్ అలీల చేతులమీదుగా అందజేశారు. దాదాపు 600ల మందికి రంజాన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ రంజాన్ పండుగను అందరు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంలో కిట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. తోఫాలతో పండగను ఖుషీగా చేసుకోవాలని, ముస్లింకు పండగ శుభాకాంక్షలను తెలిపారు.

