క్రిష్ణ‌వేణి కాన్సెఫ్ట్‌కు అవార్డుల పంట‌

కెరీర్ తాండూరు వికారాబాద్

క్రిష్ణ‌వేణి కాన్సెఫ్ట్‌కు అవార్డుల పంట‌
– సేమ్స్ ఒలంపీయాడ్‌లో స‌త్తాచాటిన విద్యార్థులు
– జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణంలోని క్రిష్ణ‌వేణి కాన్స్‌ప్ట్ స్కూల్‌కు అవార్డుల పంట పండింది. సేమ్స్ ఒలంపీయాడ్ టాలెంట్ పోటీల‌లో స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్ర‌థ‌మ‌, ద్వితీయ స్థానాల‌లో మెరిశారు. పాఠ‌శాల‌కు చెందిన న‌ల్ల చంద‌న‌(9వ త‌ర‌గ‌తి) జాతీయ స్థాయిలో ప్ర‌థ‌మ స్థానం, జీ.స్పుతిక రెండో స్థానంలో నిలిచింది. అదేవిధంగా పాఠ‌శాల‌కు చెందిన శ్రీ‌జ‌(4వ త‌ర‌గ‌తి) రాష్ట్రాస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించింది. వీరితో పాటు పి.ఇమ్మాన్యుయేల్-6వ ర్యాంక్, సి.శ్రీనితప్రియ – 6వ ర్యాంక్, ఎం.అనిత్ – 7వ ర్యాంక్, హేమంత్ సాయి పటేల్ – 7వ ర్యాంక్, సమీక్ష – 8వ ర్యాంక్, అర్చన దేశ్‌ముఖ్ – 8వ ర్యాంక్, బి.ఆకాంక్ష – 9వ ర్యాంక్‌లు సాధించారు. సోమవారం హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ సత్య సాయి నిగమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థుల‌కు అవార్డులను ప్ర‌ధానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.