ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
– 5శాతం కరువు, 48వేల ఉద్యోగులకు లబ్ది
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఆ తీపి కబురు చెప్పింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు 5% కరువు భత్యం (డీఏ) చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. 2019 జూలై నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీలో పనిచేస్తున్న 48 వేల మందికి లబ్ది చేకూరనుంది. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ వంటి యూనిఫాం ఉద్యోగులకు కనిష్టంగా రూ. 600 నుంచి గరిష్టంగా రూ. 1500ల వరకు డీఏ యాడ్ అవుతుంది. వివిధ విభాగాల్లోని అధికారులకు కనిష్టంగా రూ. 1500ల నుంచి గరిష్టంగా రూ. 5500ల వరకు డీఏ జమ అవుతుంది. ఇటీవల బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొన్న ఆర్టీసీ సంస్థ.. దశల వారిగా వాటిని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆర్టీసీ చార్జీలను రౌండ్ ఫిగర్ చేయ డం, డీజిల్ సెస్సు విధించడం ద్వారా సంస్థ ఆదాయం స్వల్పంగా పెరగడంతో కార్మికుల సంక్షేమంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్న 6 డీఏల్లో ప్రస్తుతానికి ఒకదాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


