బీసీ కమీషన్ చైర్మన్‌ను సన్మానించిన మురళీకృష్ణ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులభరణం కృష్ణ మోహన్‌ను వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ సన్మానించారు. రాష్ట్ర బీసీ కమీషన్ చైర్మన్‌గా నియమించడంపట్ల బుధవారం చైర్మన్ వకులభరణం కృష్ణమోహన్ రావును కలిశి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా బీసీ కమీషన్ సభ్యులుగా నియమించబడిన శుభప్రద్ పటేల్, ఉపేంద్ర, కిషోర్ గౌడ్‌లను కూడ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
