ప్రగతి మార్గదర్శకులు మహిళలు
– ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా రెడ్డి
– తాండూరు ఆర్టీసీలో మహిళ దినోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : నేటి సమాజంలో మహిళలు ప్రగతి మార్గదర్శకులుగా మారాలని తాండూరు ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం ఆర్టీసీ డీపోలో జరిగిన అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలకు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తో కలిసి సరళా రెడ్డి హాజరయ్యారు. ఆర్టీసీ మహిళ ఉద్యోగులతో కలిసి కోలాహలంగా సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ రంగంలో మహిళలు తమవంతు సేవలను అందించడం అభినందనీయమన్నారు. ప్రగతి చక్రంలో మహిళలు మార్గదర్శకులు కావాలని అభిలాషించారు. ప్రతి మహిళ సంకల్పంతో ముందుకు సాగేలా ఆర్టీసీ మహిళలు నిదర్శనంగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యకరమంలో మాజీ కౌన్సలర్లు అనురాధ, బంటారం లావణ్య, డీపో అధికారులు, మహిళ ఉద్యోగులు, కండక్టర్లు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

