మళ్లీ తెరపైకి సినీ తారల డ్రగ్స్ కేసు
– పలువురికి సమన్లు పంపిన ఈడీ
దర్శిని ప్రతినిధి: టాలీవుడ్‌లో మళ్లీ డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇండస్ట్రీకీ చెందిన హిరో రవితేజ, పూరీ జగన్నాధ్, ఛార్మీ, రానా, రకుల్ ప్రీత్ సింగ్, నవదీప్, ముమైత్, తరుణ్, నందు తదితరులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. పూరి జగన్నాథ్‌కు ఈనెల 31న విచారణకు హాజరుకావాలని సమన్లు పంపగా సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8న రానా దగ్గుపాటి, సెప్టెంబర్ 9న రవితేజ, నవంబర్ 15న ముమైత్ ఖాన్ హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అయితే గతంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం పలువురు సినీ ప్రముఖులను విచారించినప్పటికీ సరైన సాక్ష్యాలు లేకపోవడంతో వీరిపై విచారణ చేపట్టలేదు. అప్పట్లో తెలంగాణ ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ద్వారా దాదాపు 12 కేసులు నమోదు చేయగా.. 11 ఛార్జ్ షీట్లను ఫిల్ చేశారు. దాదాపు ఎనిమిది మంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై గతంలోనే కేసు నమోదు చేశారు. అయితే సినీ ప్రముఖులకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతో.. కేవలం కొందరిని విచారించారించి వదిలేసారు. అయితే తాజాగా మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది.
