వ‌చ్చే మేడేకు తాండూరులో ఈఎస్ఐ ఆసుప‌త్రి

తాండూరు రాజకీయం వికారాబాద్

వ‌చ్చే మేడేకు తాండూరులో ఈఎస్ఐ ఆసుప‌త్రి
– కార్మికుల సంక్షేమ‌మే స‌ర్కారు ధ్యేయం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఘనంగా ఉద్యోగ, కార్మిక సన్మాన సమ్మేళనం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వ‌చ్చే యేడాది మేడే నాటికి తాండూరులో కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుప‌త్రి ఏర్పాటుకు కృషి చేస్తాన‌ని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మేడే స్పూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఆదివారం కార్మిక దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాల్లో ఉద్యోగ, కార్మిక సన్మాన నమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల కోసం వచ్చే మేడే నాటికి తాండూరులో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కోసం కృషి చేయడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అనంతరం కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ప‌ట్లోళ్ల‌ దీపా నర్సింలు, టీఆర్ఎస్ కేవి తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు గోపాల్, టీఆర్ఎస్ పట్ట‌ణ‌ అధ్యక్షులు అప్పూ(నయూం), ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, రాజుగౌడ్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.