పేద‌లకు అండ‌గా తెలంగాణ స‌ర్కారు

తాండూరు రాజకీయం వికారాబాద్

పేద‌లకు అండ‌గా తెలంగాణ స‌ర్కారు
– టీఆర్ఎస్ హ‌యాంలోనే ప్ర‌తిఒక్క‌రికి సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు
– ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– తాండూరులో 741 మందికి క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీముభార‌క్ చెక్కుల పంపిణీ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పేద‌లంద‌రికి అండ‌గా నిలుస్తోంద‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు పేర్కొన్నారు. గురువారం తాండూరు ప‌ట్ట‌ణం ఆర్య‌వైశ్య క‌ళ్యాణ మండ‌పంలో తాండూరు నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో 741 మంది ల‌బ్దిదారుల‌కు రూ. 7 కోట్ల 41 ల‌క్ష 85 వేల 956ల విలువైన క‌ళ్యాణ ల‌క్ష్మీ, షాదీముభార‌క్ చెక్కుల‌ను ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హజ‌రై పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన త‌రువాత సీఎం కేసీఆర్ పేదింటికి తండ్రిలా, మేన‌మామ‌ల‌, బంధువుల ప్ర‌తి ఆడ‌పిల్ల కుటుంబానికి అండ‌గా నిలిచార‌ని అన్నారు. దేశంలో ఎక్క‌డా లేనివిధంగా పేదింటి యువ‌తి పెళ్లి కోసం క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీముభార‌క్ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న సీఎం కేసీఆర్ కే ద‌క్కింద‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ స‌ర్కారు పేద‌ల‌కు అండ‌గా నిలుస్తోంద‌ని, ప్ర‌తి ఒక్క అర్హుడికి సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంద‌ని పేర్కొన్నారు.

అదేవిధంగా తాండూరు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం కృష్టి చేయ‌డం జ‌రుగుతుందన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో తాండూరు చైర్మ‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్, వైస్ చైర్మ‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు, ఎంపీపీ అనురాధ ర‌మేష్‌, మార్కెట్ క‌మిటి చైర్మ‌న్లు విఠ‌ల్ నాయ‌క్, ఉప్ప‌రి మ‌హేంద‌ర్, డీసీసీబీ ఉమ్మ‌డి జిల్లా డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మ‌న్ సురేంద‌ర్ రెడ్డి, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం), టీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు క‌ర‌ణం పురుషోత్తంరావు, డీసీసీబీ మాజీ చైర్మ‌న్ ల‌క్ష్మారెడ్డి, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ మాజీ అధ్య‌క్షులు అబ్దుల్ ర‌వూఫ్, సీనీయ‌ర్ కౌన్సిల‌ర్ ప‌ట్లోళ్ల నీర‌జాబాల్ రెడ్డి, మాజీ కౌన్సిల‌ర్ జుబేర్ లాల‌, నాయ‌కులు సాయిపూర్ బాల్ రెడ్డి, సిద్రాల శ్రీ‌నివాస్, యువ‌నాయ‌కులు బిర్కగ్ ర‌ఘు, తాండ్ర రాకేష్‌, శ్రీ‌కాంత్ రెడ్డి, ద‌త్తూ త‌దిత‌రులు పాల్గొన్నారు.