ఇంటికి రాకుంటే ఆస్తంతా కోడ‌లికే రాస్తా

క్రైం తాండూరు వికారాబాద్

ఇంటికి రాకుంటే ఆస్తంతా కోడ‌లికే రాస్తా
– అదృశ్య‌మైన కుమారుడి కోసం తండ్రి ఆవేద‌న‌
– భ‌ర్త‌కోసం ఆరాట ప‌డుతున్న కోడ‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: కొడుకా.. ఇంటికి తిరిగి రాకుంటే ఉన్న ఆస్తి అంతా కోడ‌లికే రాసిస్తా.. అంటూ ఓ తండ్రి ఉద్వేగానికి లోనైతే.. క‌నిపించ‌కుండా పోయిన భ‌ర్త కోసం కోడ‌లు ఆరాట‌ప‌డుతోంది. అదృశ్య‌మైన కుమారుడి కోసం తండ్రి, భ‌ర్త కోసం కోడ‌లు ఇద్ద‌రు అల్లాడిపోతున్నారు. ఇప్ప‌టికైనా ఇంటికి తిరిగిరావాల‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే… వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతట్టికి చెందిన విశ్వ‌నాథ్‌కు ల‌క్ష్మీంప‌ల్లికి చెందిన అనురాధ‌(ల‌క్ష్మీ)తో వివాహాము జ‌రిగింది.
గ‌త నెల 29న విశ్వ‌నాథ్ ఇంటి నుంచి చెప్ప‌కుండా వెళ్లిపోయాడు. అప్ప‌టి నుంచి విశ్వ‌నాథ్ ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. విశ్వ‌నాథ్ అదృశ్యంపై బ‌షీరాబాద్ పోలీస్టేష‌న్‌లో కూడ ఫిర్యాదు చేశారు. ఆదివారం విశ్వ‌నాథ్ భార్య ల‌క్ష్మీ మీడియాతో మాట్లాడారు. తన భర్త ఎక్కడ ఉన్నా ఇంటికి త్వరగా రావాలని, ఆచూకీ తెలిసినవారు 7207546307,9010720680 కు తెలియజేయాలని పేర్కొంది. మరోవైపు విశ్వనాథ్ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ విశ్వ‌నాథ్ ఎక్కడ ఉన్న ఇంటికి త్వరగా రావాలని కోరారు. పిల్ల‌లు బెంగ పెట్టుకున్నార‌ని తెలిపార‌. త్వ‌ర‌గా ఇంటికి రాకుంటే తనపై ఉన్న ఆస్తులను అమ్మాయి పేరు కు మారుతున్నట్లు గా వెల్లడించారు. ఈ సంఘ‌ట‌న స్థానికంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.