ప్రతి ఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలి
– బాటసారులకు రాగి అంబలి, మజ్జిగ వితరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రతి ఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా అధ్యక్షులు బాకారం జైపాల్ రెడ్డి అన్నారు. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ అధ్యక్షులు రాజ్ దేశ్పాండే పిలుపు మేరకు గురువారం అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం ఉత్తర నక్షత్రం సందర్బంగా తాండూరు బస్టాండు వద్ద, బాలాజీ నర్సింగ్ హోమ్ పక్కన బాటసారులకు రాగి అంబలి, మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాకారం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ అందరు సేవా గుణాన్ని అలవరుచుకోవాలన్నారు. దాతలకు, వారి కుటుంబ సభ్యులకు, ప్రజలకు అయ్యప్పస్వామి దీవెనలు నిండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వికారాబాద్ జిల్లా ప్రచార కార్యదర్శి, ఈనాడు విలేకరి కొంపల్లి రమేష్, కోశాధికారి మిడిదొడ్డి నవీన్ కుమార్, మధుసూదన్ యాదవ్, అయ్యప్పస్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు వెంకట్ రావు, కోశాధికారి కె.మనోహర్ యాదవ్, నరేష్, తాండ్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు.

