రేపు యాలాల‌లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప‌ర్య‌ట‌న

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు యాలాల‌లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప‌ర్య‌ట‌న
– రూ. 1కోటి 10 ల‌క్ష‌ల అభివృద్ధి ప‌నుల ప్రారంభోత్సవం 
యాలాల‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: రేపు యాలాల మండ‌లంలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప‌ర్య‌టించ‌నున్నారు. శుక్ర‌వారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యం నుంచి ఈ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. యాలాల మండ‌లంలో రూ. 1కోటి 10 ల‌క్ష‌ల అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్నారు. మండ‌లంలోని లక్ష్మీనారాయణపూర్‌లో డీఎంఎఫ్టీ, ఎమ్జీఎన్ఆర్ఈసీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ ప్రారంభిస్తారు. అక్కంపల్లి, ప‌గిడిప‌ల్లిలో సీసీ రోడ్లు, రేళ్ల‌గ‌డ్డ‌తాండాలో సీసీ డ్రైన్, ప‌టేల్ చింత‌తాండాలో, జంటుప‌ల్లిలో సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్, దౌలాపూర్‌, గిరిజాపూర్, బండ‌మీదిప‌ల్లి, అగ్గ‌నూర్, పేర్కంప‌ల్లి, ఎన్కెప‌ల్లిలో సీసీ రోడ్లు, పేర్కంప‌ల్లి తాండాలో సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్ ప‌నులు ప్రారంభించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌జా ప్ర‌తినిధులు, నేత‌లు, అధికారులు హాజ‌రై ప‌ర్య‌ట‌న‌ను విజ‌యవంతం చేయాల‌ని ప్ర‌క‌ట‌న‌లో విజ్ఞ‌ప్తి చేశారు.