మృతుని ఆచూకీ లభ్యం..!
– పెద్దేముల్ మండల వాసిగా గుర్తింపు
– కేసు నమోదు చేసుకున్న పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. ఆదివారం ఉదయం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయం నుంచే విచారణ ముమ్మరం చేశారు. సంఘటనా స్థలంలో పరిశీలించినా కూడా వివరాలు లభించలేదు. దీంతో పోలీసులు మృతుని ఫోటోలను వాట్సాప్‌లో వైరల్ చేశారు. ఈ క్రమంలో మృతుడు పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన బ్యాగరి చంద్రప్ప(40)గ గుర్తించారు. కుటుంబ సభ్యులు కూడా నిర్దారించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని పట్టణ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ తెలిపారు. అయితే వ్యక్తి మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని ఎస్ఐ వెల్లడించారు. మరోవైపు మధ్యం మత్తులో చంద్రప్ప మృతి చెందినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇది కూడా చదవండి…

