ద‌ళితుల స్వ‌యం ఉపాధికి ప్రాధాన్యం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ద‌ళితుల స్వ‌యం ఉపాధికి ప్రాధాన్యం
– ఆర్థిక చేయూత‌నందిస్తున్న ద‌ళిత‌బంధు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– యాలాల‌లో ట్రాక్ట‌ర్ అంద‌జేసిన ఎమ్మెల్యే
యాలాల‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : ద‌ళితుల స్వ‌యం ఉపాధికి ప్ర‌భుత్వం ద‌గ్గ‌రి బందువుగా మారి వారి స్వ‌యం ఉపాధికి ప్రాధాన్యం క‌ల్పించేందుకు ద‌ళితబంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టింద‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. యలాల మండల కేంద్రానికి చెందిన ఉప్పలి నర్సింలు కు దళిత బంధు పథకం ద్వారా ట్రాక్ట‌ర్ మంజూర‌య్యింది. శ‌నివారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా ల‌బ్దిదారునికి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో కాలంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న దళిత సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారన్నారు. ఈ ప‌థ‌కంతో ద‌ళితుల స్వ‌య ఉపాధికి రాచ‌బాట‌గా మారింద‌న్నారు. ముఖ్యమంత్రి ఒక్కొక్క రంగాన్ని, ఒక్కొక్క వర్గానికి మేలు చేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. లబ్ధిదారులంతా సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని దళితులందరికి విడతల వారీగా ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో యాలాల ఎంపీపీ బాలేశ్వ‌ర్ గుప్త‌, తాండూరు మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్, టీఆర్ఎస్ నాయ‌కులు, ప్ర‌జా ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.