నోరు అదుపులో పెట్టుకోకపోతే..
– మంత్రి మల్లారెడ్డికి బుద్ది చెబుతాం
– తాండూరులో దిష్టిబొమ్మ దహనం
తాండూరు, దర్శిని ప్రతినిధి: మంత్రి మల్లారెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు తగిన బుద్దిచెప్పడం ఖాయమని తాండూరు కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. గురువారం కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షులు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై మంత్రి చామకూర మల్లారెడ్డి చేసిన వాఖ్యలను ఖండిస్తూ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి పై మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. మంత్రి హోదాలో ఉంటూ ఓ రౌడీలా.. పిచ్చాసుపత్రి నుంచి వచ్చిన పిచ్చోడిలా.. తొడగొట్టి సవాల్ చేయడం మంత్రి పదవికే సిగ్గుచేటన్నారు. ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలే సరైన బుద్ధి చెప్తామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు హేమంత్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డీ, జిల్లా మైనారిటీ నాయకులు నవాజ్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కావలి సంతోష్, ఎన్ ఎస్ యూ ఐ వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్, నాయకులు బాతుల వెంకటేష్, బాతుల భీంశంకర్, సమద్, జలాల్, మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ నాయకులు రియాజ్, రఘునందన్, హబిబ్ లాల,సమి, గోవింద్, ఎస్సీ సెల్ డప్పు అంజీలయ్య, ఎన్ ఎస్ యూ ఐ సీనియర్ నాయకులు సందీప్ రెడ్డీ, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

