తాండూరు డిఎస్సీ లక్ష్మీనారాయణ బదిలీ
– కొత్త డీఎస్పీగా జీ. శేఖర్ గౌడ్ నియామకం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు డీఎస్సీ లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 18న జారీ అయ్యాయి. తాండూరు డీఎస్పీగా లక్ష్మీనారాయణ 2019 అక్టోబర్ లో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి దాదాపు మూడేళ్లుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. తాండూరులో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామరస్యంగా విధులు చేపట్టడంలో మంచి గుర్తింపు సాధించారు. తాజాగా డీఎస్పీ లక్ష్మీనారాయణను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ లోని హెడ్ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఉత్తర్వులో స్పష్టం చేశారు. లక్ష్మీనారాయణ స్థానంలో తాండూరు డీఎస్పీగా జి.శేఖర్ గౌడ్ ను నియమిస్తూ అదే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం శేఖర్ గౌడ్ ఖమ్మం సీసీఆర్బి ఏసీపీగా పనిచేస్తున్నారు. త్వరలోనే ఆయన తాండూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.


