క్రీడల్లో సత్తా చాటాలి
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
– రోహిత్ అన్న మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : యువత క్రీడల్లో సత్తా చాటాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రోడ్డు మార్గంలోని పాత శాలివాహన డిగ్రీ కళాశాల మైదానంలో అమ్మాయిల క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. మంగళవారం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు హాజరై టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహ వాదపడతాయన్నారు. అబ్బాయిలతో అమ్మాయిలు అని భేదం లేకుండా అందరు క్రీడల్లో సత్తా చాటాలన్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భీంసింగ్, కోఆప్షన్ సభ్యురాలు సారంగా విజయ్ కుమార్, నాయకులు ఇంతియాజ్, మహిళ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


