అద‌ర‌గొట్టావ్‌.. అక్కంప‌ల్లి అర‌వింద్‌

కెరీర్ తాండూరు వికారాబాద్

అద‌ర‌గొట్టావ్‌.. అక్కంప‌ల్లి అర‌వింద్‌
– ప‌దిలో యాలాల మండ‌ల టాప‌ర్‌గా నిలిచిన విద్యార్థి
– అభినందించిన గ్రామ స‌ర్పంచ్, ఉపాధ్యాయులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఇటీవ‌ల విడుద‌లైన ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో తాండూరు నియోజ‌క‌వ‌ర్గం యాలాల మండ‌లానికి చెందిన అక్కంప‌ల్లి అరవింద్ అద‌ర‌గొట్టే ఉత్తీర్ణ‌త సాధించడం ప‌ట్ల ప్ర‌జా ప్ర‌తినిధులు అభినందించారు. ప‌దో త‌ర‌గ‌తిలో అర‌వింద్ 9.8 జీపీఏ సాధించి మండ‌లంలోనే టాప‌ర్‌గా నిలిచాడు. వ్య‌వ‌సాయం చేస్తూ జీవ‌నం సాగిస్తున్న అక్కంప‌ల్లి శేఖ‌ర్, సునీత‌ల కుమారుడు అర‌వింద్ అగ్గ‌నూర్‌లో జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో విద్య‌న‌భ్య‌సించాడు. ప‌దోత‌ర‌గ‌తి ఫ‌లితాల్లో 9.8జీపీఏతో ఉత్తీర్ణ‌త సాధించి.. మండ‌ల టాప‌ర్‌గా నిల‌వ‌డం ప‌ట్ల అగ్గ‌నూర్ జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో విద్యార్థి అర‌వింద్‌కు అభినందించి స‌న్మానించారు. పేదింటికి చెందిన విద్యార్థి ప‌దిలో ఉత్త‌మ ఫ‌లితాలు సాధించి మండ‌లానికి పేరు తీసుక‌రావ‌డం అభినంద‌నీయ‌ని స‌ర్పంచ్ అగ్గ‌నూర్ భీమ‌ప్ప‌, ఎంపీటీసీ గ‌రివ‌ప్ప‌, విద్యా క‌మిటి చైర్మ‌న్ వెంక‌ట‌య్య‌లు కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉపాధ్యాయులు కృష్ణరెడ్డి, కృష్ణ కుమార్, ప్రియ‌ద‌ర్శిని, మాధ‌వి, స‌తీష్‌, గ్రామ‌స్తులు పాల్గొన్నారు.