రేపు బషీరాబాద్‌లో సునితారెడ్డి పర్యటన
– అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలో రేపు వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితా మహేందర్ రెడ్డి పర్యటన ఖరారైంది. సోమవారం బషీరాబాద్ మండలంలో సునితారెడ్డి పర్యటన షెడ్యూల్ ప్రకటన విడుదలైంది. ఈ మేరకు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మండలంలోని కొత్లపూర్, దామర్ చెడ్, వాల్యనాయక్ తండా, భోజ్యానాయక్ తండా, భోజ్యనాయక్ తండా, మర్పల్లి, పర్వత్ పల్లి, గొట్టిగా ఖుర్దు, గొట్టుగా కలాన్, మల్కాన్ గిరి, మంతట్టి, కాశింపూర్ గ్రామాలలో పర్యటించి రూ.1.4 కోట్ల జడ్పి నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, ఫార్మేషన్ రోడ్లు, డ్వాక్రా భవనాలు, ఇతర అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కావున నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
కింది వరకు చూడండి…


