శెట్టి అమితానంద్కు నివాళులు
– వర్దంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– కుటుంబ సభ్యులకు పరామర్శ, భరోసా
తాండూరు, దర్శిని ప్రతినిధి : టీఆర్ఎస్ పార్టీ తాండూరు సీనీయర్ యువనాయుడు స్వర్గీయ శెట్టి అమితానంద్ కు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాళులు ఆర్పించారు. కరోనా లక్షణాల వల్ల గత యేడాది శెట్టి అమితానంద్ మరణించారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని వారి నివాసంలో శెట్టి అమితానంద్ ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన శెట్టి అమితానంద్ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి.. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా అందించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాసాచారి, పొట్లీ మహరాజ్ దేవాలయ చైర్మన్ రాజన్ గౌడ్, పటేల్ కిరణ్ తదితరులు ఉన్నారు.



