ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్
– 30 శాతం గౌరవ వేతనం పెంపు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులకు సర్కారు శుభవార్త చెప్పింది. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచుల గౌరవ వేతనాన్ని 30 శాతం మేర పెరిగాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.10 వేలు ఉండగా.. దానిని రూ.13వేలకు పెంచింది. ఎంపీటీసీలు, సర్పంచుల వేతనం రూ.6500కు పెరిగింది. గౌరవ వేతనాన్ని పెంచడంపట్ల ప్రజా ప్రతినిధులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
