చైర్ పర్సన్ ఇంట చవితి సందడి
– గణేషునికి భక్తిశ్రద్దలతో పూజలు
– ప్రార్థించిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ నివాసంలో వినాయక చవితి సందడి నెలకొంది. బుధవారం వినాయక చవితి సందర్భంగా వారి ఇంట్లో మట్టి వినాయకున్ని ప్రతిష్టించారు. చవితిని పురస్కరించుకుని చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ భర్త తాటికొండ పరిమళ్ గుప్త కుటుంబ సభ్యులతో కలిసి వినాయకునికి భక్తిశ్రద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందు పూజల వాడు అయిన వినాయకుని కృప అందరిపై ఉండాలని దేవున్ని ప్రార్థించారు. పట్టణ వాసులందరికి ఆమె వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకునికి పూజలు, భజన కీర్తనలతో వారి నివాసంలో వినాయక చవితి సందడి నెలకొంది.


