పట్టుదలతో లక్ష్యాలను సాధించుకోవాలి

కెరీర్ తాండూరు వికారాబాద్

పట్టుదలతో లక్ష్యాలను సాధించుకోవాలి
– తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్
– సింధు డిగ్రీ రిధమ్ ఉత్స‌వాలు అదుర్స్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : విద్యార్థులు పట్టుదలతో శ్రమించి లక్ష్యాలను సాధించుకోవాలని తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ పేర్కొన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్లో సింధు డిగ్రీ కళాశాల విద్యార్థులు రిధమ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్జీ అశోక్ కుమార్ ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో విద్యార్థి దశ ముఖ్యమైందని అన్నారు. ఉన్నత స్థాయికి ఎదిగేందుకు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, ఇందుకు పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. క‌ష్ట‌ప‌డి ల‌క్ష్యాల‌ను సాధించిన వారిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని సూచించారు. నేటి సమాజంలో అందివస్తున్న సాంకేతికను అందిపుచ్చుకోవాలన్నారు. అదేవిధంగా కళాశాల విద్యార్థులు సివిల్స్‌లో రాణించి ర్యాంకులు సాధించడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులు బహుమతులు ప్రదానం చేశారు.

ఆడిపాడిన విద్యార్థులు

మరోవైపు కళాశాల విద్యార్థులు రిధమ్ ఉత్సవాలలో ఆడి పాడారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని పలు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. దేశభక్తి, సంస్కృతి సంప్రదాయాలపై విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సింకినేని రవీందర్ రావు, ప్రెసిడెంట్ వి రంగారావు, ప్రిన్సిపల్ విజయాదేవి. అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.