శభాష్.. రమేష్..!
– అభినందించిన కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ ను శభాష్ అంటూ అభినందించారు. దేశ రాజధాని ఢిల్లీ నార్త్ ఎవెన్యూలోని మంత్రి నివాసంలో కపిల్ మోరేశ్వర్ పాటిల్‌ను యు.రమేష్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా రాజకీయాలు, పార్టీ పరిస్థితులపై రమేష్ కుమార్ తో మాట్లాడి ఆరా తీశారు. జిల్లాలో పార్టీ కోసం చేపడుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి గురించి మంత్రికి వివరించడంతో రమేష్ కుమార్ ను శభాష్ అంటూ మెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, కావున రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ సూచించినట్లు యు. రమేష్ కుమార్ తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో పార్టీని బలోపేతం చేసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందని యు. రమేష్ కుమార్ మీడియాతో పేర్కొన్నారు.



