అన్నదానం గొప్పది

తాండూరు రాజకీయం వికారాబాద్

అన్నదానం గొప్పది
– వైశ్య ఫెడరేషన్ సేవ అభినందనీయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల ఆకలి తీర్చే అన్నదానం ఎంతో గొప్పదని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్‌లు అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని మున్సిఫ్ కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

న్యాయమూర్తి టీ.స్వప్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి వచ్చిన కక్షిదారులకు, పేదల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డితో పాటు వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ లు కక్షిదారులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ లోక్ ఆదాలతో వచ్చిన వారికి అన్నదానం చేయడం సంతోషకరమన్నారు. వైశ్య ఫెడరేషన్ అందించిన సేవ అభినందనీయమన్నారు. రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో వైశ్య ఫెడరే షేన్ ఎల్లప్పుడు ముందుంటుందన్నారు. ఇందులో భాగంగా పేదలకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్, మహేందర్ రెడ్డి, న్యాయవాదులు రాంరెడ్డి, రజిత, అనిత, వైశ్య ఫెడరేషన్ సభ్యులు గౌరీశంకర్, వెంకట్ దాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.