తాండూరు అభివృద్ధి రోహిత్ రెడ్డితోనే సాధ్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు అభివృద్ధి రోహిత్ రెడ్డితోనే సాధ్యం
– మహిళల సాధికారతకు బీఆర్ఎస్ ప్రాధాన్యం
– ఎమ్మెల్యే తల్లి, జెడ్పీటీసీ ప్రమొదిని రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితోనే తాండూరు నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని, మరోసారి గెలిపిస్తే మరింత ప్రగతిని సాధిస్తుందని ఎమ్మెల్యే తల్లి, వికారాబాద్‌ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పెద్దేముల్ మండలంలోని హన్మాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి మాతృ మూర్తి జడ్పీటీసీ శ్రీమతి ప్రమొదిని మహిళలతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులను మహిళలకు తెలియజేశారు. మహిళా సాధికారత కోసం బీఆర్ఎస్ పార్టీ తోడ్పాటు అందిస్తుందన్నారు.

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారితోనే తాండూరు అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు. ఈ నెల 30వ రోజున జరిగే పోలింగ్ లో ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి రోహిత్ రెడ్డి గారిని మరొమారు తాండూరు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా కన్వీనర్ శకుంతల, నాయకులు వెంకట్ మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..