రోహిత్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యే కావాలి
– తాండూరు నుంచి పాదయాత్ర చేసిన యువకులు
– ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేశారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యే కావాలని స్థానిక యువకులు మొక్కు తీర్చుకున్నారు. తాండూరు పట్టణానికి చెందిన జై శ్రీరాం అశోక్ ఆధ్వర్యంలో యువకులు పాదయాత్ర చేపట్టారు. శనివారం పట్టణంలోని సీతారాంపేట్ హనుమాన్ దేవాలయం నుంచి వికారాబాద్ అనంతగిరి పద్బనాభ దేవాలయం వరకు పాదయాత్ర చేశారు. రాత్రి వరకు పాదయాత్ర పూర్తి చేసి దేవాలయంలో మొక్కు తీర్చుకున్నారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యే కావాలని సంకల్పిస్తూ పాదయాత్ర చేసినట్లు యువకులు తెలిపారు.
ఇది కూడా చదవండి…

