టెట్‌ ఫలితాలకు ముహుర్తం ఖరారు

కెరీర్ తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

టెట్‌ ఫలితాలకు ముహుర్తం ఖరారు
– జులై 1న విడుదల
– ప్రకటించిన మంత్రి సబితారెడ్డి
హైద‌రాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగవకల్పించేందుకు జూన్ 12న నిర్వ‌హించిన ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌(టెట్‌) ఫ‌లితాల విడుద‌ల‌కు ముహుర్తం ఖ‌రారైంది. జులై 1వ తేదీన టెట్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో విద్యాశాఖ ప‌నితీరుపై స‌బితా ఇంద్రారెడ్డి త‌న కార్యాల‌యంలో ఇవాళ స‌మీక్ష నిర్వ‌హించారు. టెట్ ఫ‌లితాల వెల్ల‌డిలో జాప్యానికి ఆస్కారం లేకుండా జులై 1న విడుద‌ల చేయాల‌ని ఆమె ఆదేశించారు. ఈ స‌మీక్ష స‌మావేశంలో విద్యాశాఖ కార్య‌ద‌ర్శి వాకాటి కరుణ‌, విద్యాశాఖ సంచాల‌కులు దేవ‌సేన‌, ఎస్ఈఆర్‌టీ డైరెక్ట‌ర్ రాధారెడ్డి, ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల సంచాల‌కులు కృష్ణారావుతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.