ఇండస్ట్రీయల్ పార్కు భూసేకరణ అధికారిగా తాండూరు సబ్ కలెక్టర్
– ప్రకటించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని పోలేపల్లి, హకీంపేట్, లగచెర్ల గ్రామాలలో మల్టి పర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్ నెలకొల్పుటకు భూసేకరణ అధికారిగా తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌ను నియమించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. టీజీఐఐసీ ప్రతి పాదనల మేరకు తాండూరు సబ్ కలెక్టర్ భూ సేకరణ అధికారిగా నియమించడం జరిగిందని ఓ ప్రకటనలో వెల్లడించారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా విలేజ్‌ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.
ఫార్మా విలేజ్‌ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దుద్యాల మండలంలోని పోలేపల్లి, హకీంపేట్, లగచెర్ల గ్రామాల పరిధిలో టీజీఐఐసీ ద్వారా మల్టీ పర్సన్ ఇండస్ట్రీయల్ పార్కు నెలకొల్పుటకు గాను తాండూరు సబ్ కలెక్టర్ పేరుతో గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేయడం జరిగిందని వెల్లడించారు.
ఇదికూడా చదవండి…

