గంజాయి రవాణాపై పంజా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

గంజాయి రవాణాపై పంజా..!
– కిలో ఎండు గంజాయి పొట్లాట స్వాదీనం
– కర్ణాటక నిందితున్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్
– తాండూరు పట్టణ పోలీస్టేషన్ లో కేసు నమోదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : గంజాయి రవాణాపై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పంజా విసిరారు. కర్ణాటక నుంచి తాండూరుకు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కిలోకు పైగా ఎండు గంజాయిని స్వాదీనం చేసుకున్నారు.

వికారాబాద్ జిల్లా కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి కేసు వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. కర్ణాటక రాష్ట్ర నుంచి కలుబురిగి జిల్లా సేడం పట్టణానికి చెందిన ఖాసీం పటేల్ అలియాస్ ఖాసీం(29) అనే వ్యక్తి తాండూరుకు గంజాయిని రవాణా చేస్తున్నారని జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ అన్వర్ పాష, బృందం దాడులు చేపట్టారు.
kvcs
కర్ణాటక నుంచి రైల్లో తాండూరుకు గంజాయిని తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 1100 గ్రాముల ఎండు గంజాయిని గుర్తించారు. నిందితున్ని విచారణ నిమిత్తం తాండూరు పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై తాండూరు పట్టణ పోలీస్టేషన్లో ఎన్టీపీఎస్ చట్టం సెక్షన్ 42 (2) కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. అదేవిధంగా ఈ గంజాయి రవాణా వెనుక ఎవరి హస్తం ఉందనే దానిపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన మత్తు పదార్థాల రవాణా, విక్రయాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

అభివృద్ధి, సంక్షేమమే.. బీజేపీ ధ్యేయం..!