కలెక్టర్ కె.నిఖిల కరుణ..!
– జర్నలిస్టు చికిత్సకు రూ.1.50లక్షల ఆర్థిక సహాయం
– ప్రత్యేక సహాయ నిధి ఏర్పాటుకు హామి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి పాలైన జర్నలిస్టుపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల కరుణ ప్రదర్శించారు. ఆయన ఆరోగ్యం కోసం రూ. 1.50లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాలిల్లోకి వెళితే.. ఇటీవల వికారాబాద్‌కు చెందిన జీ-టీవీ మీడియా ప్రతినిధి మురళీకృష్ణ ద్విచక్ర వాహనంపై నుంచి జారీ పడి తీవ్ర గాయాల పాలయ్యారు. తలకు బలమైన గాయాలు కావడంతో గత వారం రోజులుగా హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మురళీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో స్థానిక మీడియా ప్రతినిధులు విషయాన్ని జిల్లా కలెక్టర్ కె.నిఖిల దృష్టికి తీసుకవచ్చారు. ఇందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో తన సొంత నిధుల నుంచి రూ. 1.50 లక్షల చెక్కును మీడియా ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీడియా ప్రతినిధుల ఆదాయం అంతంతా మాత్రమే ఉంటుందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు జర్నలిస్ట్ ల కొసం ప్రత్యేక సహాయ నిధి ఏర్పాటు చేసి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అనునిత్యం ప్రజల కొసం పని చేసే జర్నలిస్ట్ లకు ఎల్లపుడు అండగా ఉంటామన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి అందించిన సహాయానికి మీడియా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, సీనీయర్ జర్నలిస్టులు ఉన్నారు.



