శ్రీవారి సేవలో సునీతా మహేందర్ రెడ్డి
– తిరుమల స్వామివారిని దర్శించుకున్న జెడ్పీ చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి తిరుమల శ్రీవారి సేవలో తరించారు. గురువారం కూతురు మనీషారెడ్డి, సోదరుల కూతుర్లు శ్రీ కుతి, శ్రీయుతతో కలిసి తిరుమలను సందర్శించారు. టీటీడీ ప్రొటోకాల్ అధికారులు సునితారెడ్డికి స్వాగతం పలికారు. శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాత సేవలో సునితారెడ్డి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా సునితారెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా ప్రజలు అందరు సంతోషంగా ఉండాలని, రైతులకు సుభిక్షం కలగాలని ప్రార్ధించినట్లు తెలిపారు.



