క‌మ‌లం వీడి కారెక్కిన కౌన్సిల‌ర్

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

క‌మ‌లం వీడి కారెక్కిన కౌన్సిల‌ర్
– కండువా క‌ప్పి ఆహ్వానించిన మంత్రి స‌బితారెడ్డి
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స‌మ‌క్షంలో చేరిక‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ ప‌రిధిలోని బీజేపీ మ‌రోసారి గ‌ట్టి దెబ్బ త‌గిలింది. ఇటీవ‌లే ఆ పార్టీ మున్సిప‌ల్ ఫ్లోర్ లీడ‌ర్‌గా ఉన్న సిందూజ గౌడ్ బీజేపీ వీడి టీఆర్ఎస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. తాజాగా అదే క‌మ‌లం పార్టీకి చెందిన 20వ వార్డు కౌన్సిల‌ర్ సంగీత అజ‌య్ సింగ్ ఠాకూర్ కారెక్కారు. గురువారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఆమె టీఆర్ఎస్‌లో చేరారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స‌మ‌క్షంలో మంత్రి స‌బితారెడ్డి సంగీత ఠాకూర్‌కు గులాబీ కండువ క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ప‌నుల‌ను చూసి పార్టీలో చేర‌డం సంతోషఃగా ఉంద‌ని మంత్రి స‌బితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు సంగీత ఠాకూర్‌ను అభినందించారు. మ‌రోవైపు కౌన్సిల‌ర్ సంగీత ఠాకూర్‌తో పాటు వార్డుకు చెందిన బీజేపీ పార్టీ యువ‌కులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ వైస్ చైర్మన్ ప‌ట్లోళ్ల దీపా నర్సింలు, నియోజకవర్గ అధికార ప్రతినిధి రాజు గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు అఫ్పూ(న‌యూం), సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్, ప‌ట్లోళ్ల‌ నర్సింలు, శ్రీనివాస్ చారి, పట్టణ పార్టీ కార్యదర్శులు ఎం.శ్రీ‌నివాస్, సంతోష్ గౌడ్, కౌన్సిలర్లు సిందుజా గౌడ్, ఎర్రం వసంతా తదితరులు ఉన్నారు.