ఓపెన్ స్కూళ్లకు దరఖాస్తు చేసుకోండిలా..!
తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువు మద్యలో మానేసి మళ్లీ చదువుకోవాలనే వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మంగళవారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంంభమయ్యింది. ఓపెన్ స్కూల్ విధానంలో 2021-22 సంవత్సరానికి గాను దరఖాస్తులు చేసుకోవాలని ఓపెన్ స్కూల్ సొసైటీ తెలిపింది.
ఎలాంటి అపరాధ రుసుము లేకుండా సెప్టెంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చాని, ఆపై రూ. 1000ల అపరాధ రుసుము చెల్లించి వచ్చే నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. అభ్యర్థులు www.telanganaopenschool.org లో, స్థానిక స్టడీ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. పదో తరగతిలో అడ్మిషన్ కోసం ఓసీలు రూ. 1100లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మహిళలు రూ. 700 చెల్లించాల్సి ఉంటుందని, ఇంటర్‌లో అడ్మిషన్ కోసం రూ. ఓసీ పురుషులు రూ. 1300లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు రూ. 1000లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
