రాజ్ పుత్ మహిళా సంఘం కార్యవర్గం ఎన్నిక
– అధ్యక్షురాలుగా నిఖిత ఠాకూర్ ఏకగ్రీవం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు రాజ్‌పుత్ మహిళ సంఘం కార్యవర్గం శనివారం ఏర్పాటయ్యింది. పట్టణంలోని కోడంగల్ రోడ్డు మార్గంలో ఉన్న భవాని మాత ఆలయంలో రాజ్‌పుత్ మహిళ సంఘం ఎన్నికలు నిర్వహించారు. రాజ్‌పుత్ సంఘం తాండూరు మహిళా కమిటీ నూతన అధ్యక్షురాలిగా నిఖిత ఠాగూర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా గాయత్రి ,శిల్ప, స్వప్న ఠాకూర్, ప్రధాన కార్యదర్శులుగా పల్లవి ఠాకూర్, ఉప కార్యదర్శులుగా అర్చన, పూజ, శివాని ఠాకూర్, పింకీ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం మహిళ అధ్యక్షురాలుగా నిఖిత ఠాకూర్ రెండోసారి ఎన్నిక కావడం విశేషం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి తను ఎల్లప్పుడూ కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ పుత్ సంఘ అధ్యక్షులు మహేష్ సింగ్, ప్రధాన కార్యదర్శి శివానంద్ సింగ్, కమిటీ సభ్యులు లక్ష్మీబాయి, జయశ్రీ, ఝాన్సీ, ఇందిరా, విజయలక్ష్మి, గీత, జాగృతి, పమితి, విజయలక్ష్మి, హారతి, మీనా, పద్మిని బాయి, శకుంతల బాయిలు పాల్గొన్నారు.



